కొల్లూరు కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్‌రూమ్ నివాసితులు నీటి సమస్య, మురుగునీటి లీకేజీతో తరుచూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం విజయక్రాంతి ప్రతినిధి వారిని పలకరించగా సమస్యలను ఏకరువు పెట్టారు. తాగునీరు రోజుకు గంటసేపు కూడా సరిగా రావడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవన సముదాయంలో నెలరోజుల నుంచి చెత్త ఎత్తేవారు రాకపోవడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయన్నారు. మరో పక్క బోర్‌నీళ్లకు సంబంధించి ట్యాంకులు నిండి నీరు వృథాగా పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
పటాన్‌చెరు, విజయక్రాంతి