సోలో బతుకే సో బెటర్ అంటున్నారు ఈతరం సీనియర్స్. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఒంటరిగా జీవిస్తున్న 46.9 శాతం మంది వృద్ధులు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ తమ జీవితాలు సంతృప్తిగా ఉన్నాయ ని అంగీకరించారు. సర్వేలో 41.5 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు.
ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల పరిస్థితిపై ‘ఏజ్ వెల్ ఫౌండేషన్’ నిర్వహించిన సర్వేలో గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే (13.4 శాతం) పట్టణ ప్రాంతాల్లో (15 శాతం) ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. సర్వే ప్రకారం.. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల్లో 41.9 శాతం మందిలో 46.5 శాతం మంది మహిళలున్నారు. ఐదేళ్లకుపైగా స్వతంత్రంగా జీవిస్తున్నట్లు వారు తెలిపారు. 21.5 శాతం మంది వృద్ధాప్యంలో ఒంటరిగా జీవించడం ముఖ్యమైనదిగా భావించారు.
అయితే సర్వేలో 41 శాతం మంది వృద్ధులు ఒంటరిగా జీవించడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నప్పటికీ.. కొన్ని విషయాల్లో హాయిగా ఉంటు న్నామని కూడా తెలిపారు.
ఈ సందర్భంగా ఏజ్వెల్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ హిమాన్షు రాత్ కుటుంబంలోని వివిధ తరాల మధ్య కమ్యూనికేషన్ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. వృద్ధులకు ఆరోగ్య సదుపాయాలను పెంచడం, వారి భద్రత, ఆర్థిక బలాన్ని నిర్ధారించడానికి చట్టాలు చేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
లాభాలు
- మీ కోసం ఎక్కువ సమయం
- ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసే అవకాశం
- కుటుంబం, స్నేహితుల కోసం గడిపే అవకాశం
- నిద్ర, విశ్రాంతి కోసం ఎక్కువ సమయం
- కొత్త స్నేహాలు చేయొచ్చు
- మమ్మల్ని మీరు తెలుసుకునే అవకాశం
- ఇతరులకు సహాయం చేసే సమయం
కొన్ని నష్టాలు
- బలహీనత భయం
- కొన్ని సందర్భాల్లో తిరస్కరణకు గురికావడం
- ఏకాంతం
- తక్కువ ఆత్మగౌరవం
- సామాజిక ఆందోళన
- వ్యక్తిగత ఎదుగుదల లోపించడం