calender_icon.png 23 February, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సజీవ సమాధి

31-01-2025 01:13:33 AM

  1. మట్టిపెళ్లలు కూలి ఇద్దరు ఉపాధి కూలీల దుర్మరణం
  2. రోడ్డుపని కోసం మట్టి తవ్వుతుండగా ప్రమాదం
  3. ఆరు ఫీట్ల వరకు మట్టి కమ్మేయడంతో ఊపిరాడక చనిపోయిన తల్లీకూతుళ్లు
  4. మరో ఐదుగురికి గాయాలు
  5. సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలో ఘటన

హుస్నాబాద్, జనవరి 30: ఉపాధి పనిచేస్తుండగా మట్టిపెళ్లలు కూలడంతో ఇద్దరు కూలీలు సజీవ సమాధి అయ్యారు. గురువారం సిద్ధ్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)లో పనిచేస్తున్న కందారపు సరోజన (55), ఆమె కూతురు అన్నాజి మమత (30) రోడ్డు పనికోసం మట్టి తవ్వుతుండగా బండరాళ్లు, మట్టిపెళ్లలు మీదపడి చనిపోయారు.

ఈ ఘటనలో మరో ఐదుగురు కూలీలు తీ  గాయపడ్డారు. గ్రామస్తులు, పోలీసు  తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధ్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలోని కల్కిచెరువు సమీపంలోని బైరి సైద  బావి నుంచి సంజీవరాయగుట్ట వద్ద చిలుపూరి శ్రీనివాస్‌రెడ్డి బావి వరకు ఉపాధి హామీ పథకం కింద మట్టిరోడ్డు నిర్మిస్తున్నారు.

గురువారం ఉదయం 21 మంది కూలీలు వచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటస్వామి సంజీవరాయగుట్ట వద్ద మట్టి తవ్వా  చెప్పి, సమీపంలోని బొడిగెపల్లిలో కూ  పని ప్రదేశాన్ని చూపించేందుకు వెళ్లాడు. సంజీవరాయగుట్ట వద్ద కూలీలు మట్టి తవ్వడం మొదలుపెట్టగా.. కూలీలపై ఒక్కసారిగా మట్టిపెళ్లలు, బండరాళ్లు విరిగిపడ్డాయి.

దీంతో కందారపు సరోజన, ఆమె కూతురు అన్నాజి మమత అందులో కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే చనిపో  మరో ఐదుగురు కూలీలు ఇంద్రాల స్వరూ  ఇంద్రాల రేణుక(40), వలబోజు మణెమ్మ(50), తాటికొండ విమల(50), గౌడ వెంకట  తీవ్ర గాయాలయ్యాయి.

అతికష్టం మీద వారిని బయటకు తీశారు. మృతదేహాలను, గాయపడినవారిని 108లో హుస్నాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంద్రాల స్వరూపకు సీరి  ఉండటంతో ఆమెను ఎంజీఎంకు తీసుకెళ్లారు. 

మంత్రి సీతక్క సీరియస్..

ఈ ఘటనపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు చేయించవద్దని గతంలోనే చెప్పినా ఎందుకు పట్టించు    ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనపై సమ  విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుం  మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషి  ఇవ్వాలని గ్రామస్తులు సంఘటన స్థ  బైఠాయించారు. హుస్నాబాద్ ఏసీపీ, సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట ఎస్సై విజయభాస్కర్ వచ్చి అధికారులతో మాట్లాడి న్యా టాం చేస్తామని ఆందోళనకారులకు సముదాయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయభాస్కర్ తెలిపారు. 

మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్, జనవరి 30 (విజయక్రాంతి): గోవర్ధనగిరిలో ఉపాధిహామీ పనులు చేస్తుండగా బండరాళ్లు మీదపడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే సిద్ధిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరికి ఫోన్‌చేసిన బండి సంజయ్ ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు.

మృతుల కుటుంబాలను అన్నివిధాల ఆదుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల సాయం అందిస్తామని, దీంతోపాటు మృతులు మహిళా పొదుపు సంఘాల్లో కొనసాగుతున్నందున మరో రూ.10 లక్షల వరకు ఆర్థికసాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. దీంతోపాటు ఆ కుటుంబంలో ఎవరైనా అర్హులుంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.