* -పొట్ట నింపని గంగిరెద్దుల విన్యాసాలు
* అదరణ కోల్పోతున్న ప్రదర్శనలు
* ప్రభుత్వం ఆదుకోవాలంటున్న కులస్తులు
సిరిసిల్ల, జనవరి 13, (విజయక్రాంతి): ఆధునిక ప్రపంచంలో గంగిరెద్దుల విన్యాసా లు కనుమరుగవుతున్నాయి. వాటిని నమ్ముకోని జీవనం సాగిస్తున్న కుటుంబాల పరిస్థితి దయనీ యంగా తయారైంది. సం క్రాంతి పండుగా వచ్చిందంటే చాలు గంగిరె ద్దులు విన్యాసాలు ప్రదర్శనలు, హరిదాసుల కథలతో గ్రామాల్లో సందండి నెలకొనేది.
కాని ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని ప్రదర్శన లకు ఆదరణ లేకపోవడంతో, వాటిని కాస్త ప్రదర్శించే వారే కరువయ్యారు. ప్రదర్శనలు పక్కన పెట్టి పొట్టకూటి కోసం వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తు న్నారు. సంక్రాంతి పండుగా పురస్కరించు కోని గంగిరెద్దుల కులస్తుల పై ‘విజయ క్రాంతి’ ప్రత్యేక కథనం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపుగా 1600 కుటుంబాలు ఉంటాయి. అందులో కోనరావుపేట మండలం కొండాపూర్, మరి మడ్ల, బావుసాయిపేట, చందుర్తి మండలం సనుగుల, జోగాపూర్ గ్రామాల్లో అధిక గంగి రెద్దుల కుటుంబాలు నివాసం ఉంటున్నా యి.
గతంలో వీళ్లంతా ఇంటింటికి తెల్లవారు జామున ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేసేవాళ్లు తెల్లవారుజామున గంగిరెద్దును ముస్తాబు చేసి పల్లెపల్లెకూ వెళ్లి గంగిరెద్దును ఆడించేవాళ్లు ‘డూడూ బసవన్న.. ఇటు రారా బసవన్న.
ఉరుకుతూ రారన్నా.. రారా బసవన్న అయ్యాగారికి దండం పెట్టూ.. అమ్మగారికి దండం పెట్టూ.. మునసబు గారి కి దండం పెట్టూ, కరణం గారికి దండం పె ట్టూ అంటూ ప్రదర్శనలు చేసేవారు. దానికి జనం ఇచ్చే డబ్బులు, ధాన్యంను తీసుకునే వాళ్లు అనాధిగా వస్తున్న ఆచరాన్ని నేటి తరంకు మాత్రం ముందుకు తీసుకపోవడం లేదు.
దీనికి తోడు టీవీలు, సినిమాలు, మొబైల్‌లో బిజిబిజీగా ఉంటూ, గంగిరెద్దుల విన్యాసాలు చూడలేని పరిస్థితి నెలకొంది. ఈ కుటుంబాలు ఆరు నెలలు ఇంటికి, పిల్లలకు దూరంగా ఉండేవాళ్లు ఊరును, పిల్లలను విడిచిపెట్టి వెళ్లాలంటే ఇబ్బంది పడినప్పటికీ, తప్పని పరిస్థితుల్లో బిక్షాటనకు వెళ్లే వారు. కానీ మారుతున్న కాలానుగు ణంగా వారిలో సైతం జీవన శైలి మారింది.
గంగిరెద్దుల విన్యాసాలు చేయకుండా ఇంటి వద్దనే ఉన్న వ్యవసాయ భూముల్లో పంటల సాగు చేస్తూ, పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. మహిళలు మాత్రం ఇప్పటి కి ఊరూరా తిరుగుతూ పిన్నిసులు, దువ్వెన లు, అద్దాలు అమ్ముకుంటూ, మగవారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.
కాని ఎన్ని ప్రభుత్వాలు మారిన తమ బతుకులు మాత్రం మారడం లేదన్నారు. ప్రభుత్వం తమకు గంగిరెద్దుల విన్యాసాలకు బదులుగా ప్రత్యామ్నాయ పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సొంత ఊరి లోనే ఏదైనా ఉపాధి కల్పించి, తమ కులాన్ని అదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పథకాలు అందేలా చూడాలి
ఆర్ధికంగా వెనుక బడిన వారికి ప్రభు త్వం ఉపాధి అవకా శాలు కల్పించాలి. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడం లేదు. గతంలో కొండాపూర్లో హాస్టల్ ఏర్పాటు చేసి తీసేశారు. మా పిల్లల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తే బాగుటుంది. తమకు కళాకారుల పింఛన్ అందించాలి.
నర్రావుల వెంకటేష్, గంగిరెద్దుల నాయకుడు
పల్లె పల్లెకూ తిరుగుతూ భిక్షాటన
గతంలో పల్లె పల్లెకకై తిరుగుతూ భిక్షాటన చేసేవాళ్లం. తాత, తండ్రి కూడా ఇదే పని చేసే భిక్షాటన బంద్ చేసి, ఊళ్లోలనే వ్యవసాయం చేసుకుంటున్నా. కొంత భూమిని కౌలు తీసుకోని పంటలు సాగు చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటున్నా.
గంట ఎల్లయ్య, కొండాపూర్, గంగిరెద్దుల కులస్తుడు
భిక్షాటన బంద్ చేసినం
తాతల నుంచి వచ్చిన భిక్షాటన ఆచారం బంద్ చేసినాం. మేక లు, అవులను కాసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. ఊళ్లోనే ఉంటున్న ఎక్కడికి పోతలేను. చాలా మంది భూములు కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నారు. భిక్షాటన కంటే ఇదే పని బాగుంది.
కర్రె మల్లయ్య, కొండాపూర్, గంగిరెద్దుల కులస్తుడు