కొంపల్లి సాగర్ సంతాప సభకు హజరైన కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే
సంతాప సభలో మాట్లాడుతున్న కేంద్ర సామాజిక న్యాయం సాధికరత, ఉపాధి కల్పన సహాయ మంత్రి రాందాస్ అథవాలే, ఆర్పీఐ పార్టీ నాయకులు
ప్రభుదాస్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
సిద్దిపేట (విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలు భద్రంగా ఉంటాయని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు, కేంద్ర సామాజిక న్యాయం సాధికరత, ఉపాధి కల్పన శాఖ సహాయక మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి, నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన కొంపల్లి సాగర్(22) ఇటివలె రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం జక్కాపూర్ గ్రామంలో నిర్వహించిన సాగర్ సంతాప సభకు కేంద్ర సహాయక శాఖ మంత్రి రాందాస్ అథవాలే హజరై మాట్లాడారు. చిన్న వయసులో బీఆర్ఎస్ పార్టీలో చేరి సోషల్ మీడియా ద్వారా రాజకీయంగా మంచి స్థానం సంపాదించుకున్న సాగర్ ఆకాల మరణం అంచరిని బాధిస్తుందన్నారు.
నేటి యువకులు చిన్న వయసులోనే కార్లు, బైక్లు నడుపుతూ రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడం లేదని అందుకే సంవత్సారానికి 2 లక్షల మంది యువకులు రోడ్డు ప్రమాదంలో ఆకాల మరణం పొందుతున్నారని తెలిపారు. కారులో సీటు బెల్టు, బైక్ పై హెల్మేట్ వాడితే 90 శాతం మరణాలను అరికట్టవచ్చని తెలిపారు. దేశానికి సేవ చేయాల్సిన యువకులు రోడ్డుపై ప్రాణాలు కోల్పోవడం దారుణమన్నారు. హైదరాబాద్ నుంచి జక్కాపూర్ వరకు రోడ్డు బాగుందని కితాబిచ్చారు. యువకులు రొడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. సాగర్ కుటుంబానికి ఆర్పిఐ అండగా ఉంటుందన్నారు. కొంపల్లి సాగర్ తండ్రి కొంపల్లి ప్రభుడాస్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో 40 సంవత్సరాలుగా కోనసాగుతున్నారని చెప్పారు. ప్రస్తూకం రెండు తెలుగు రాష్ట్రల ఇంచార్జీగా కోనసాగుతున్నారని చెప్పారు.
పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో ప్రభుదాస్ సంపన్నుడని కొనియాడారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దళితుల సంక్షేమం కోసం పని చేస్తున్నప్పటికి పార్టీలో అన్ని కుల, మత, వర్గాల నాయకులు సేవలందిస్తారని చెప్పారు. ఆర్బిఐ దేశ వ్యాప్తంగా రాజకీయ సేవలందిస్తుండని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 సార్లు, ప్రస్తుతం ప్రధాన మంత్రి మోడి సారధ్యంలో రెండు సార్లు కేంద్ర మంత్రిగా సేవలందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుదాస్ కుమారున్ని కోల్పోవడం చాలా భాధకరమని ఆయన కుల సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమలలో ఆర్పిఐ జాతీయ నాయకులు నాగేశ్వర్ రావు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల అధ్యక్షులు బ్రహ్మానంద రెడ్డి, పనుగా రవి, నాయకులు శ్రీనివాస్, మాజీ ఎంపీపి బలమల్లు, మాజీ సర్పంచ్ పర్సరాలు, మాజీ ఎంపీటీసీ బాల్ రెడ్డి, నాయకులు దండు శంకర్, సతీష్, రోజా తదతరులు పాల్గొన్నారు.