13-02-2025 11:33:30 PM
ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలి..
బీసీలకు రాజ్యాధికారం రావాల్సిందే..
జనాభా దమాషా పద్దతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీలకు అధికారంలో అవకాశం కల్పించాలి..
సీని నటుడు సుమన్ వెల్లడి..
కామారెడ్డి (విజయక్రాంతి): మత్తుతో జీవితాలు చిత్తు అవుతున్నాయని ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకువచ్చినప్పుడే మత్తు పదార్థాల రవాణా, వినియోగం తగ్గుతుందని యువత జీవితాలు ఆగమ్యగోచరం కాకుండా ఉంటాయని ప్రముఖ సీనినటుడు సుమన్ అన్నారు. గురువారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చి ఓ ప్రవేట్ వివాహ కార్యక్రమానికి హజరైన అనంతరం ఓ ప్రవేట్ హోట్‌లో విజయక్రాంతితో మాట్లాడారు. బీసీల జనాభాకు అనుగుణంగా రాజ్యాధికారం రావాల్సిందేనన్నారు. ప్రభుత్వాలు జనాభా దమాషా పద్దతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీలకు అధికారంలో అవకాశం కల్పించినప్పుడే అన్ని వర్గాలు అభివృద్ది చెందుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్తుపదర్థాల నిషేదంపై ఉక్కుపాదం మోపాలన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారని వారి తల్లితండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు.
పబ్బులలో ఎక్కువగా ఐటీ యువతి,యువత ఎంజాయ్ చేస్తూ దేశ సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోతున్నారన్నారు. సీని పరిశ్రమలో సైతం కొంతమంది డగ్స్, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి పరిశ్రమకు చెడ్డపేరు తెస్తున్నారన్నారు. ప్రస్తుతం అన్ని పట్టణ ప్రాంతాల్లో డ్రగ్స్, మత్తు పదార్థాలు యువత వాడుతున్నారన్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని అన్నారు. యువతను డ్రగ్స్ వాడకుండా అవగాహన సదస్సులను నిర్వహించడంతో పాటు ఇతర దేశాల్లో ఉన్న కఠిన మైన శిక్షలను మనదేశంలో కూడా అమలు చేయాలన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందన్నారు. సింగాపూర్ ప్రభుత్వం అమలు చేసిన చట్టాలను భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలన్నారు. ప్రాచ్చాత్య విష సంస్కృతిని విడనాడాలన్నారు. సమాజ సేవలో భాగంగా పేద పిల్లలకు ఉచితంగా మార్షల్ విద్యను నేర్పిస్తున్నట్లు తెలిపారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఉచిత అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పెరిగిన మోథో సంపతితో ప్రకృతి ప్రసాదించిన పంచభూతాలను లాభపేక్ష కోసం వ్యాపారం చేస్తుండటంతో వాతావారణం కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2030లో యుద్దం వచ్చే ప్రమాదం పొంచి ఉందని జోష్యం చెప్పారు. ఈ సారి మార్చి, ఏప్రిల్, మే, నెలల్లోనే వర్షాలు తుపాన్ సంభవించే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వాలు నిరుపేద ప్రజలకు ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందే విధంగా చూడాలన్నారు. నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ఏ పట్టణ ప్రాంతంలో చదువుతున్న వారికి అక్కడే ఉద్యోగ అవకాశలు కల్పించే విధంగా పరిశ్రమలను స్థాపించాలని కొరారు. 47 సంవత్సరాల నుండి తాను చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు 175 సినిమాలు తీయడం జరిగిందని క్యారెక్టర్ అరిస్ట్‌గా 800ల సినిమాల్లో నటించడం జరిగిందన్నారు. తెలుగు, హిందీ, తమిళం, మాలయాళం, కన్నడ, గుజరాతీ లాంటి ప్రాంతీయ భాషల్లో సైతం సినిమాలు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 5 సినిమాలు వివిధ ప్రాంతీయ భాషల్లో విడుదలకు సిద్దంగా ఉన్నాయన్నారు. సామాజానికి మేలు జరిగే ప్రతి కార్యక్రమంలో తనవంతు కృషి, భాగస్వామ్యం ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేయడం లేదని మంచి పనులు చేస్తే ఏ పార్టీకైనా తన మద్దతు ఉంటుందని తెలిపారు. సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దేందుకు యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.