calender_icon.png 30 October, 2024 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌తో జీవితాలు ప్రభావితం

01-08-2024 12:05:00 AM

టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి

నిజామాబాద్, జులై 31 (విజయక్రాంతి): ఆర్థిక వ్యవస్థలో ప్రజలు జీవితాలను ప్రభావితం చేసే అంశాల్లో బడ్జెట్ ప్రధానమైనదని తెలంగాణా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫె సర్ యాదగిరి అన్నారు. టీయూ కామర్స్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఓపెన్ హౌస్ ఆన్ యూని యన్ అండ్ స్టేట్ బడ్జెట్ 2024 అంశంపై నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు, సామాజిక న్యా యం, ధరల స్థిరత్వం, అంతర్జాతీయ చెల్లింపుల సమతౌల్యత బడ్జెట్ ప్రధాన లక్షణాలుగా ఉన్నాయన్నారు.

కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యానికి రోడ్డు మ్యాపుగా ఉన్నదని, పేదలు, యువకులు, మహిళలు, వ్యవసాయ ప్రధా నంగా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఉండటం స్వాగతించాల్సిన విషయమని తెలిపారు. కార్యక్రమంలో టీయూ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆరతి, కామర్స్ విభా గం డీన్ గోపిశెట్టి రాంబాబు పాల్గొన్నారు. 30 మంది విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లను సమీక్షించారు.