calender_icon.png 17 April, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీర్ఘకాలిక వ్యాధులలో లివర్ సిర్రోసిస్

08-04-2025 07:16:41 PM

బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు సత్తయ్య..

మంచిర్యాల: మెడికల్ అటెండెన్స్ రూల్స్ ప్రకారం దీర్ఘకాలికమైన వ్యాధులలో లివర్ సిర్రోసిస్ వ్యాధిని కూడ ఆమోదించినట్లు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) జిల్లా అధ్యక్షులు యాదగిరి సత్తయ్య తెలిపారు. స్టాండర్డ్ డైజేషన్ కమిటీలో భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్, జాతీయ సేఫ్టీ కమిటీ సభ్యులు కొత్త కాపు లక్ష్మారెడ్డి, బిఎంఎస్ కమిటీ సభ్యులు సుధీర్ గురుడే, మజ్రుల్ హక్ అన్సారి, యాదగిరి సత్తయ్య సుదీర్ఘంగా చర్చించి కోల్ ఇండియా యాజమాన్యాన్ని ఒప్పించి మెప్పించి మెడికల్ అటెండెన్స్ రూల్స్ ప్రకారము దీర్ఘకాలికమైన వ్యాధులను గుర్తించిన విధంగా లివర్ సిరోసిస్ వ్యాధిని కూడ లిస్టులో చేర్చాలని డిమాండ్ మేరకు ఆమోదించారని తెలిపారు.

సంస్థ మెడికల్ బోర్డుకు గతంలో దీర్ఘకాలికమైన జబ్బులైన గుండె జబ్బు, టీబి, క్యాన్సర్, లెప్రసి, పక్షవాతం, మూత్రపిండ వ్యాధులు, హెచ్.ఐ.వి., మెదడు వ్యాధితో పాటు లివర్ సిర్రోసిస్ కలిపారన్నారు. దీర్ఘకాలికమైన వ్యాధులకు మెడికల్ బోర్డు నిర్ధారణ చేసే వరకు ప్రత్యేక సెలవు మంజూరు చేయబడిన 50 శాతం (మూల వేతనం+ వేరియబుల్ డియర్ నెస్ అలవెన్స్+ స్పెషల్ డియర్ నెస్ అలవెన్స్) ఏ విధంగా చెల్లిస్తున్నారో లివర్ సిర్రోసిస్ జబ్బుకు కూడ ప్రత్యేక సెలవుతో కూడిన వేతనం చెల్లిస్తారని వెల్లడించారు.