- పొగతాగకపోయినా వ్యాధి వచ్చే ప్రమాదం
- ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై సంచలన విషయాలు వెల్లడించిన శా్రస్త్రవేత్తలు
- ధూమపానం చేసేవారికంటే చేయనివారిలోనే ఎక్కువగా క్యాన్సర్ లక్షణాలు
- జన్యు వైవిధ్యం, వాయు కాలుష్యం ద్వారా సంభవించే అవకాశం
- 2025 నాటికి పట్టణ ప్రాంతాల్లో మరింత అధికమవుతుందని వెల్లడి
న్యూ ఢిల్లీ: నేను జీవితలంలో స్మోకింగ్ చేయలేదు.. నాకు లివర్ క్యాన్సర్ వచ్చే ప్రసక్తే లేదు అని మీరు భ్రమలో ఉన్నారా? అయితే ఆ భ్రమల్లో నుంచి బయటకు రండి.. ధూమపానం చేయకపోయినా మీకు ఉపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అవును ఇది నిజమే.. భారతదేశ శాస్త్రవేత్తలు గత కొన్నేళ్లుగా లివర్ క్యాన్సర్‌పై చేస్తున్న పరిశోధనల్లో సంచలన విషయాలను కనుగొన్నారు.
వారు వెల్లడించిన విషయాలను ఒకసారి గమనిస్తే.. భారతదేశంలోని మెజార్టీ లివర్ క్యాన్సర్ రోగులు ఎప్పుడూ ధూమపానం చేయలేదని.. వాయు కాలుష్యం కారణంగా వారికి క్యాన్సర్ సోకిందని స్పష్టం చేశారు. వాయు కాలుష్యం, క్యాన్సర్‌కు కారణమయ్యే ఇతర పర్యావరణ కారకాల వలన మనుషుల్లో లివర్ క్యాన్సర్ సోకుతోందని ప్రాథమింకగా నిర్ధారించారు. లివర్ క్యాన్సర్ పరిశోధనల్లో భారతదేశం.. ప్రపంచ నిష్పత్తిలో 0.51 శాతం ఉందని ముంబైలోని టాటా మెమోరియల్ ఆసుపత్రి బృందంతో చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఓ ప్రధాన సంచికలో ప్రచురించిన కథనం ప్రకారం.. పాశ్యాత్త దేశాల కంటే భారతదేశంలో ఊపరితిత్తుల క్యాన్సర్ పేషెంట్ల నిష్పత్తి ఒక దశాబ్దం ముందుగానే ఉంది. ఇది 50 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య నిర్ధారణ అవుతోందని వెల్లడించారు.
2025లోగా డబుల్ అయ్యే అవకాశం..
- * దేశంలో లంగ్ క్యాన్సర్ పేషెంట్ల రేటు క్రమంగా పెరుగుతోందని.. లక్షమంది జనభాలో 1990లో 6.62 శాతం, 2019లో 7.7 శాతం లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని.. 2025 నాటికి ఈరకం క్యాన్సర్ కేసుల్లో భారీ పెరుగుదల ఉంటుందని స్పష్టం చేశారు.
- * ధూమపానం చేసే మగ, ఆడవారిలో క్యాన్సర్ రేటు 42.4% - ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
- * వాతావరణ మార్పుల కారణంగా కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు.
- * ప్రంపచ వాయు నాణ్యత లెక్కల ప్రకారం 2022 నాటికి సౌత్ ఏషియాలో ప్రపంచం మొత్తంలో 37 వరకు వాయి కాలుష్యం అధింకగా ఉండే నగరాలు ఉండగా అందులో ఒక్క భారత దేశంలోన నాలుగు నగరాలు ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోన్న విషయం.
- * చైనా, ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్ వంటి దేశాలు ఆసియాలోనే అత్యం వాయు కాలుష్యం కలిగిన దేశాలుగా ఉండటంతో పాటు 2020 నాటికి దాదాపు 9.65లక్షల కొత్త లంగ్ క్యాన్సర్ కేసులను కలిగి ఉన్నాయి.
- రానున్న రోజుల్లో వాతావరణంలో జరుగుతున్న మార్పుల లంగ్ క్యాన్సర్‌ను వేగంగా విస్తరించేందుకు కారణం అవుతోందని ఇది సమస్త మానవాళికి పెద్ద ఛాలెంజ్‌గా పరిణమించిందని.. కాలుష్యాన్ని అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను, ప్రజలను హెచ్చరించారు శాస్త్రవేత్తలు.