16-03-2025 12:55:31 AM
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాం తి): యశోద హాస్పిటల్స్ -సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ సర్జరీ వైద్య రం గంలో వస్తున్న అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్ సహాయం, ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్, ఇంటిగ్రేషన్ వంటి అత్యాధునిక వైద్య విధానాలు ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స యొక్క భవిష్యత్తుపై ‘హైదరాబాద్ ఆర్థ్రోస్కోపీ కాన్‌క్లేవ్ పేరిట 15, 16వ తేదీల్లో హోటల్ పార్క్ హయత్‌లో శనివారం 2 రో అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్ షాప్‌ను ప్రారంభించారు.
మొదటి రోజు ముఖ్య అతిధిగా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పాల్గొని సదస్సును ప్రారంభించి, మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో స్పోర్ట్స్ ఇంజూరీ, మెడిసిన్, ఆర్థ్రోస్కోపీపై జరుగుతున్న ఈ అంత సదస్సు, లైవ్ వర్క్ షాప్‌లో జాతీ అంతర్జాతీయ అధ్యాపకులు రోబోటిక్ శిక్షణ, లైవ్ సర్జరీ, వీడియో ఆధారిత బోధనతో జ్ఞాన మార్పిడిని పొందవచ్చాన్నారు. యువ ఆర్థోపెడిక్ వైద్యులకు ఇది సరైనా వేదిక అని జిష్ణు దేవ్ వర్మ తెలిపారు.
యశో హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్, డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. ఆర్థ్రోస్కోపీ శస్త్రచికిత్సలో అత్యాధునిక పద్ధతులు, పురో దృష్టి సారించే ఈ అంతర్జాతీయ సదస్సు, లైవ్ వర్క్ షాప్, మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ యొక్క ప్రాముఖ్యతను తెలియ అత్యాధునిక రోబోటిక్ సహా ఏఐ ఇంటిగ్రేషన్ వంటి అత్యాధునిక వైద్య విధానాల ద్వారా అనేక ఆర్థోపెడిక్ సర్జరీలు విజయవంతంగా ఎలా నిర్వహించాలో సదస్సుకు హాజరైన 600 మందికి పైగా యువ సర్జన్లకు వివరించారు.
ఆర్థో వైద్య రంగంలో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 60 మందికి పైగా ప్రముఖ అంతర్జాతీయ జాతీ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులతో వారి అనుభవాలను పంచుకునే విధంగా అంతర్జా సదస్సు రూపొందించినట్టు డాక్టర్ ప గోరుకంటి తెలిపారు.
సదస్సులో అధునాతన ఆర్థ్రోస్కోపిక్ పద్ధతులు, ఆర్టిఫిసి ఇంటలిజెన్స్, ఇంటిగ్రేషన్ ఆధారిత రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు ప్రత్యక్ష రోబోటిక్ శస్త్రచికిత్సలను ప్రదర్శించారు. దేశం నలుమూలల నుంచి 600 మందికిపైగా ఆర్థోపెడిక్ సర్జన్లు పాల్గొన్నారని యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ సీనియర్ స్పోరట్స్ ఆర్థోపెడిక్స్, ఆర్థ్రోస్కోపీ సర్జన్, డాక్టర్ ఆర్‌ఏ పూర్ణచంద్ర తేజస్వి తెలిపారు.