బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖశాంతులతో జీవించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. కాల ప్రవాహంలో ఎదురొచ్చే మంచి చెడులను కష్టసుఖాలను సమానంగా స్వీకరించే స్థిత ప్రజ్ఞతను అలవర్చుకుంటూ ఆశావహ దృక్పథంతో తమ జీవితాలను చక్కది ద్దుకోవాలన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మ కమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు.