calender_icon.png 3 April, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణ దాతలుగా జీవించండి

02-04-2025 12:51:50 AM

రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ 

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): రక్తదానం చేసి ప్రాణదాతలుగా జీవించాలని రెడ్ క్రాస్ చైర్మన్ లైన్ నటరాజ్ అన్నారు. మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యం లో మెగా రక్తదాన శిబిరంను తెలంగాణ గ్రామీణ రీజనల్ ఆఫీస్ లో  నిర్వహించారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఆరాధ్య దైవం, కామ్రేడ్ దిలీప్ కుమార్ ముఖర్జీ 13వ వర్ధంతి సందర్భంగా టి జి బి ఆఫీసర్స్ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులు పాల్గొనే రక్త దానం చేశారు.

ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ చైర్మన్ నటరాజ్ మాట్లాడుతూ ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం అన్నారు. తలసీమియా పిల్లలకు రక్తం అందించడం మనందరి బాధ్యతని వారానికి రెండుసార్లు రక్తం అందించడం జరుగుతుందని గుర్తు చేశారు.

ఈ శిబిరంలో మొత్తం 71యూనిట్లు సేకరించామన్నారు ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం అధ్యక్షుడు మక్కడ్, వేణు గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ సత్యనారాయణ, తెలంగాణ నేఫా ఆర్గనైజర్ యాదవ రాజు,వీరేశ్, ప్రవీణ్, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.