calender_icon.png 8 February, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న చిన్న జీయర్ స్వామి

08-02-2025 04:59:35 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శనివారం నాడు దర్శించుకున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి. శనివారం సాయంత్రం మూడు గంటలకు కాలేజీ మైదానంలో 20వేల మందితో నిర్వహించే విష్ణు సహస్ర నామ పారాయణంలో పాల్గొనటానికి భద్రాచలం విచ్చేసిన స్వామివారు. భద్రాచలం ప్రధాన దేవాలయం వద్ద చిన్న జీయర్ స్వామివారికి ఆలయం మర్యాదలతో స్వాగతం పలికిన అర్చకులు అధికారులు. ఈ సందర్భంగా స్వామివారు భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో రమాదేవి, అర్చకులు వేద పండితులు, జీయర్ మఠం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.