హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (విజయక్రాంతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (ఐహెచ్‌ఎం)లో ఈ నెల 25, 26 తేదీల్లో ‘లిటిల్ ఇండియా పేరుతో రెండ్రో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సంజయ్ కే ఠాకూర్ తెలిపారు.
విద్యా ఐహెచ్‌ఎం క్యాంపస్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లా హాస్పిటాలిటీ రంగంలో రాణించాలనే విద్యార్థులకు ఈ ఉత్సవాలు ఉత్తమ వేదికగా నిలుస్తాయాన్నారు.
ఆహారం మాత్రమే కాకుండా స్పోర్ట్స్ మీట్, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాండప్ కామెడీ, కెరీర్ ఆసక్తి గల వారికి ఓపెన్ డే వంటి అనేక వినోదాలతో ‘లిటిల్ ఇండియా’ ప్రత్యేకంగా ఉంటుందన్నారు.
రెండ్రోజుల పాటు మధ్యాహ్నం 12:30 నుంచి రాత్రి 10:30 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ ఉత్సవంలో దేశంలోని వివిధ రుచులను ప్రదర్శించనున్నామని చెప్పారు. ఈ ఉత్సవాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం 99591 54371 /99639 80259 నంబర్లలో సంప్రదించాలన్నారు.