టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ్యాక్‌టుబ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. చిరు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా వస్తోంది. దీనికి సం బంధించి ఆసక్తికర వార్త ఒక టి బయటకువచ్చింది. ఈ ఇద్దరు ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముం దుకు రాబోతున్నారం టూ ఇండస్ట్రీ సర్కిల్‌లో జోరుగా చర్చ నడుస్తున్న తరుణంలో నిర్మాత సాహు గారపాటి ఆ చర్చలను మరింత ఆసక్తికరంగా మలచడానికి అన్నట్టు ఉప్పందించారు.
‘యాక్షన్ ఎలిమెంట్స్‌తో సాగే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ఇది. మేమంతా చిరంజీవి సినిమాలు, ఆయన ట్రేడ్ మార్క్ ఎలిమెంట్స్ చూస్తూ ఎదిగినవాళ్లం. అనిల్ రావిపూడి స్టుల్‌లో మెగాస్టార్‌ను చూడబోతున్నాం. అనిల్ రావిపూడి ఫ్లేవర్ కామెడీతో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఉండబోతుందీ సినిమా’ అని ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చారు.
చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’, శ్రీకాంత్ ఓదెల సినిమాలతో బిజీగా ఉన్న విష యం తెలిసిందే. ఇవి పూర్తి కాగానే అనిల్ రావిపూడి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారట. కాగా అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ టీమ్‌తో కలిసి ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారీ డైరెక్టర్.