calender_icon.png 20 April, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహిత్యం.. ముందు తరాలకు ఆదర్శం

04-09-2024 02:24:33 AM

  1. భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ 
  2. జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకావిష్కరణ

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 3(విజయక్రాంతి): సాహిత్యం భావితరాలకు ఆదర్శ ంగా ఉంటుందని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం ఆనంధఖనిలోని టీచర్స్ ట్రెయినింగ్ సెంటర్‌లో తెలం గాణ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో ముద్రించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర స్వ రూపం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. జిల్లా చరిత్రను గ్రంథస్థం చేసి భావితరాలకు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం కవులను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వరచారి, సారస్వత పరషత్ ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య, నవభారత్ వైస్ ప్రసిడెంట్ శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.