calender_icon.png 21 April, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూఢాచారాలపై అక్షరాస్త్రం

21-04-2025 01:57:48 AM

చరణ్ పరిమి రాసిన ‘బొంబాయి పొట్టేలు’ ఇత ర కథలు పేర్న విడుదలైన కథా సంపుటి కొనగానే టైటిల్ కథ చదివాను. నిజానికి ఇందులో మొత్తం 10 కథలు ఉన్నాయి. బయట ఎక్కడైనా సమూహాల్లో బీఫ్ తినడం మన కలవాటు అని చెబుదామంటే, మన పక్కనున్న వారు ముందు మన నోటి ని మూసేస్తారు. తినని వారు తినేవారిని చిన్నచూపు చూడటం, మరీ ఎక్కువయితే అసహ్యించుకోవటం మామూలై పోయిం ది. అంతటి హేయభావం ఎందు కో అర్థం కాదు. ‘బొంబాయి పొట్టేలు’ కథలో ఇలాంటి విష యాన్ని చక్కగా వివరించారు.

‘శుద్ధి’ అనే కథలో ఒక ఫొటోగ్రాఫర్ తన కులాన్ని బయట పెట్టకుండా లోలోపలి అంతర్మధనాన్ని మన కళ్లెమ్మట కన్నీటి ధారల్లా పారిస్తాడు. ‘కూడలి వైపుకి’ కథలో లోలోపల మాల మాదిగల్లో ఉండే వైషమ్యాలు కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు చరణ్ పరిమి. ‘అతిథితో అక్కడి దాకా’ కథలో స్త్రీ ఎప్పుడూ పురుషుడికి తన కోరికని తీర్చుకోవడానికి అందిన ఆట వస్తువులానే ఉంటుందన్న విషయాన్ని తేటతెల్లం చేశా రు.

ఇందులో కథకుడి తాలూకు మ్యాజిక్ రియలిజం పాఠకులను ఆలోచింపజేస్తుం ది. ‘అరణ్యకాండ’ కథలో నివురు గప్పిన అజ్ఞానంతో, నిండా మునిగిన మూఢ నమ్మకాల్లో ఊరెలా వల్లకాడవుతుందో, అక్కడి రాజకీ య కోణాల్ని లోతుల్లోకి దిగి విశ్లేషించి చెప్పారు. ‘నక్షత్ర ధార’ కథద్వారా బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా తరతరాలుగా జ్ఞానానికి దూరంగా ఉన్నా యో చెప్పారు. ఈ కథకి కొనసాగింపుగా ‘మల్లదాసు’ కథల్లో బౌద్ధ కట్టడా లు హిందూ దేవాలయాలుగా మారడాన్ని మన కళ్ళ ముందు నిలిపారు.

‘పొగ’లో ప్రభుత్వాలు వారి రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులని ఎలా పావులుగా వాడుకుంటాయో తెలిపారు. ‘వరదరాజమ్మ’ కథలో వేల ఏళ్లుగా కొనసాగుతున్న అట్టడుగు వర్గాల ప్రాణాల్ని బలిగా తీసుకునే కుతంత్రాలని చెప్పారు. ‘దేవ గన్నేరు’ కథలో సరిత, వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మమ్మలు అంతా ఒక ఊరి గుడి మాతంగులు. అంటే, దేవుడికి భార్యలు అని అర్థం. పుస్తకంలోని కథలన్నీ సమాజంలోని ఇలాంటి దురాచాలపై అక్షరాలను ఎక్కువపెట్టి అస్త్రాలు అనే చెప్పాలి.

బొంబాయి పొట్టేలు, (కథా సంకలనం), రచన: చరణ్ పరిమి, వెల: రూ.170/ ప్రతులకు: అమెజాన్ లేదా రేగి అచ్చులు పబ్లికేషన్స్ (సాయి వంశీ:9010866078).

 బాలాజీ పోతుల సెల్: 8179283830