calender_icon.png 25 December, 2024 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన కోసం ఇళ్ల లిస్టింగ్ షురూ

02-11-2024 01:15:22 AM

  1. మూడు రోజుల పాటు కుటుంబాల గుర్తింపు
  2. ఒక ఎన్యుమరేటర్‌కు 150-175 ఇళ్ల వస్తాయని అంచనా
  3. సర్వేలో ఇండ్లకు స్టిక్కర్లు
  4. 6 నుంచి మూడు వారాల పాటు కులగణన

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా చేపట్ట బోతున్న కులగణనకు అధికార యంత్రాం గం సన్నద్ధమవుతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఇంటింటి సర్వే ప్రారంభం కానుండగా.. శుక్రవారం నుంచి ఇళ్లను లిస్టింగ్ చేసే ప్రక్రియకు ఇబ్బంది శ్రీకారం చుట్టారు.

మూడు రోజులపాటు కుటుంబాలను గుర్తించనున్నారు. పది మంది ఎన్యుమరేటర్లను ఒక బ్లాక్‌గా ఏర్పాటు చేసి.. ఒక్కొక్కరు 150 నుంచి 175 ఇళ్ల వరకు సర్వే చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ అంచనాల మేరకు 80 వేల ఎన్యుమరేటర్లను కులగణనకు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది కుటుంబాల ఆధారంగా నిర్వహించే సర్వే కాబట్టి.. ఒక గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి? ఆ ఇళ్లలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి? అనే వివరాలను ప్రాథమికంగా అంచనా వేసేందుకు శుక్రవారం నుంచి ఇళ్ల లిస్టింగ్ ప్రక్రియను చేపట్టారు.ఒక్కో ఎన్యుమరేటర్ కనిష్టంగా 150, గరిష్టం 175 ఇళ్లకు సర్వే చేయాల్సి ఉంటుంది.

ఎన్యుమరేటర్లకు కేటాయించిన బ్లాక్‌లో కొన్ని ఇళ్లలో ఎక్కువ కుటుంబాలు ఉండొచ్చు. కొన్ని ఇళ్లలో తక్కువ కుటుంబాలు ఉండొచ్చు. ఒకవేళ ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే ఎక్కువ కుటుంబాలు ఉంటే ఆ బ్లాక్‌కు అదనపు ఎన్యుమరేటర్‌ను కేటాయిస్తుంది. ఒక్కొక్కరికి 175 ఇళ్లు వస్తే మాత్రం అదనంగా ఎన్యుమరేటర్‌ను నియమించదని ప్రణాళిక శాఖ వర్గాలు చెప్పాయి.

సర్వేలో ఇండ్లకు స్టిక్కర్లు

ఇళ్ల లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికీ స్టిక్కర్లు అంటించనున్నారు. వాటికి అనుగుణంగా కులగణన చేయనున్నారు. 

క్షేత్రస్థాయిలో సంయుక్తంగా..

గ్రామస్థాయిలో దాదాపు పది డిపార్ట్‌మెంట్లను ప్రభుత్వం కులగణన కోసం వినియోగించుకుంటోంది. ఇందులో కారోబార్లు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశ వర్కర్లు, పంచాయతీ సెక్రటరీ.. ఇలా క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది ఇళ్ల లిస్టింగ్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఆదివారంలోగా ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత కుటుంబాలు ఎన్ని ఉన్నాయనే అంచనాకు అధికారులు వస్తారు. దానిప్రకారం ఈనెల 6వ తేదీ నుంచి మూడు వారాలపాటు పూర్తిస్థాయిలో కుటుంబాల వారీగా కులగణన సర్వే చేయనున్నారు. 

ఇప్పటికే శిక్షణ పూర్తి.. 

కులగణనకు సంబంధించి రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఎన్యుమరేటర్ల శిక్షణ పూర్తుంది. కులగణన ప్రక్రియను రాష్ట్రస్థాయిలో పర్యవేక్షించేందుకు నోడల్ ఆఫీస ర్‌గా హైదరాబాద్ కలెక్టర్ ఉంటారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండలస్థాయిలో ఏఎస్‌ఓలు, పంచాయతీస్థాయిలో సెక్రటరీ బాధ్యు లుగా ఉండనున్నారు. వీరు ఆయా స్థాయిలో కులగణనకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా వారి వారి హోదాను బట్టి పరిష్కరించనున్నారు. ఇప్పుడు ఇళ్ల లిస్టింగ్ ప్రక్రియ కూడా వీరి ఆధ్వర్యంలోనే జరుగుతోంది.