calender_icon.png 5 April, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగాది పంచాంగ శ్రవణం

31-03-2025 12:00:00 AM

మంచిర్యాల, మార్చి 30 (విజయక్రాంతి) : మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం వేడుకలు నిర్వహించారు.

కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, దేవి దేవతల కరుణాకటాక్షాల కలిగి, అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు ఆకాంక్షించారు. అనంతరం ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అటవి శాఖ అధికారి ఆశిష్ సింగ్, పోలీస్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.