calender_icon.png 26 April, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సమస్యలు వింటూ.. అవగాహన కల్పిస్తూ

26-04-2025 12:00:00 AM

  1. భూభారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ రాజర్షి షా

సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో కలెక్టర్ భోజనం

ఆదిలాబాద్, ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : రైతుల సమస్యలను ఓపిగ్గా వింటూ... భూ భారతి చట్టంపై వారికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా అవగాహన కల్పిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన చట్టంపై జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగం గానే శుక్రవారం జిల్లాలోని మారుమూల ప్రాంతమైన గాదిగూడలో భూ భారతి ఆర్.ఓ ఆర్ చట్టం పై అవగాహన సదస్సు లో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్ది, సబ్ కలెక్టర్ యువరాజ్, ఏ.ఎన్.వి వైస్ చైర్మన్ మారుతి తో కలసి  కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఆన్ని రంగాల్లో అభివృధ్ధి , మౌళిక వసతుల కల్పనలో ప్రత్యేక చొరవ తీసుకొని అభివృద్ధి దిశగా ముందుకు వెళుతున్నామని ఆన్నారు. భూ భారతి చట్టం ద్వారా ఆన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, రైతులు ఈ చట్టం పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆన్నారు.

ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూ భారతి హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం అభిస్తోందన్నారు. వారసత్వంగా వచ్చిన భూములను మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలం లో విచారణ, భూమి హక్కులు ఏ విదంగా సంక్రమించిన మ్యుటేషన్ చేసి రికార్డులలో నమోదు చేసుకోవచ్చన్నారు.

పాసు పుస్తకాలలో భూమి పటం, భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ, భూ దార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, అబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, గ్రామ్ రెవెన్యు రికార్డుల నిర్వహణ, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారాలు ఉంటాయని ఆన్నారు.

ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూము లపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్‌ఓఆర్ చట్టాన్ని తెచ్చిందని వివరించారు.

అనంతరం నార్నూర్ మండల కేంద్రంలోని సన్న బియ్యం లబ్ధిదారుడు సుకుమార్ ఇంట్లో కలెక్టర్ భోజనం చేసి కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.