calender_icon.png 12 January, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగుల వెతలు వినండి!

13-07-2024 12:00:00 AM

నరేష్ పాపట్ల :

‘యూత్ డిక్లరేషన్’లో మొత్తం ఐదు అంశాలతో కూడిన 17 హామీల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చక పోవడం గమనార్హం. ‘ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసిన ‘చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో నిరుద్యోగ యువత ఆగ్రహానికి లోనవుతున్నది.

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ నిరుద్యో గుల వెతలు తీరడం లేదు. దక్షిణ భారతదేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రత ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ముందు వరుసలో ఉం ది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్లు నియామకాల విషయంలో తీవ్ర అలసత్వం ప్రదర్శించింది. పరీక్షల రద్దు, పేపర్ లీకేజీలు, ఆత్మహత్యలు వంటి సంఘటనలు నిరుద్యోగ యువతను పోరుబాట పట్టేలా చేశాయి.

ఆ ఉద్యమాలకు కాంగ్రెస్, బీజేపీలతోపాటు మేధావి వర్గం పోటాపోటీగా మద్దతు ప్రకటించాయి. ఈ లోపు రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిరుద్యోగ సమస్యకు అధిక ప్రా ధాన్యత ఇస్తూ కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించాయి. కళ్లు కాయలు కాచేలా చదివిన తమకు ఉద్యోగాల భర్తీలో అన్యాయం జరిగిందని, ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు తమ ఓటును వినియోగించుకోవాలంటూ నిరుద్యోగ యువత ముక్తకంఠంతో పిలుపు నిచ్చింది. ఫలితం గా బీఆర్‌ఎస్ ఊహించని విధంగా పరాభవం చెందిన విషయం తెలిసిందే. ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రకటించిన కాంగ్రెస్ రాష్ట్రంలో తొలిసారిగా అధికార పీఠమెక్కింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి నిరుద్యోగుల హామీలను ఆదిలోనే అటకెక్కించారు.

‘యూత్ డిక్లరేషన్’లో మొత్తం ఐదు అంశాలతో కూడి న 17 హామీల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చక పోవడం గమనార్హం. ‘ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసిన ‘చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో నిరు ద్యోగ యువత ఆగ్రహానికి లోనవుతున్నది. స్వరాష్ట్రం సిద్ధించి దశాబ్దం అవుతున్నది. పాలకులు ఇంకా ‘నిర్లక్ష్య పరీక్ష’ పెడుతుండటంతో పస్తులుం టూ పుస్తకాలతో కుస్తీ పట్టే నిరుద్యోగులు ఎర్ర చీమలదండులా కదులుతున్నా రు. వారి న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుంటే తేనెటీగలై ప్రభుత్వాన్ని చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. గత ప్రభు త్వ తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలి. 

నిన్నటి హామీలు నెరవేర్చాలి

2023 మే 8న సరూర్‌నగర్ సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ స్వయంగా ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రకటించారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జూన్ 2 నాటికి అధికారికంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, తొలి, మలి ఉద్యమ అమరుల కుటుం బాలకు నెలకు రూ.25 వేలు పెన్షన్.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వంటి హామీలు గుప్పించారు. ఇక, అదే ఏడాది నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎవరూ ఊహించని విధంగా అశోక్‌నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీని సంద ర్శించి నిరుద్యో గులతో భేటీ అయ్యారు.

తాము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన బహిరంగంగా హామీ ఇచ్చారు. ఇవి పూర్తిగా నమ్మిన నిరుద్యోగులు ప్రభుత్వ మార్పు లో కీలక భూమి క పోషించారు. తీరా అధికారం చేపట్టాక ‘ప్రజాపాలన’ అని చెప్పు కుంటున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో క్రమంగా మా ర్పు కనిపిస్తున్నది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్ల క్ష్యం వహిస్తున్నారు. ఏడు నెలల్లో సుమారు 17 సార్లు హస్తినకు వెళ్లిన ముఖ్యమంత్రి నిరుద్యోగుల గోస వినేందుకు ఒక అరగంట సమయం ఇవ్వక పోవడం గమనార్హం. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. ఇకనైనా, దాటవేసే ధోరణికి స్వస్తి పలికి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.  

‘మావి గొంతెమ్మ కోరికలు కావు’ 

నిరుద్యోగులు అడిగేవి గొంతెమ్మ కోరికలేం కావు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వయంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గ్రూప్ 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలవాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశారు. అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ ఆ హామీని తుంగలో తొక్కి నిరుద్యోగులకు పం గనామం పెట్టింది. డీఎస్సీ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులకు మరో 5,973 పోస్టు లు కలిసి మొత్తం 11,062కు నోటిఫికేషన్ విడుదల చేసి కాం గ్రెస్ ప్రభు త్వం చేతులు దులుపుకొన్నది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమం త్రి నారా చంద్రబాబునాయుడు ‘మెగా డీఎస్సీ’ ఫైల్‌పై తొలి సంతకం చేసి ఇచ్చిన మాట నిలుపుకున్నారు.

ఇక్కడ మా త్రం 25 వేల పోస్టుల ‘మెగా డీఎస్సీ’ హామీని విస్మరించారు. ఇదెక్కడి అన్యాయమని నిరు ద్యోగులు గొంతెత్తడం పాపమా? రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలను గుర్తించే ప్రక్రియలో నిర్లక్ష్యం సహించరానిది. సాధ్యపడే అధికారిక జాబ్ క్యాలెండర్ రూప కల్పనలో ఎందుకింత అలసత్వం? డీఎస్సీ పరీక్షలు ముగిసిన వెంటనే గ్రూప్ పరీక్ష తేదీలు ఉన్నాయి. ఇంత స్వల్ప వ్యవధిలో డీఎస్సీ అభ్యర్థులు గ్రూప్  ఎలా రాయగలరు? కనీసం రెండు నెలలు గ్యాప్ ఉం డాలన్న అభ్యర్థన న్యాయబద్ధ్దమైందే కదా? గ్రూప్ రెండు వేలు, గ్రూప్ 3లో మూడువేల పోస్టులు పెంచితే ఎక్కువమంది అభ్యర్థులకు మేలు జరుగుతుం ది కదా? జీవో 46 బాధితుల మొర ఆలకించాలి కదా? గురుకుల అభ్యర్థులకు నియా మక పత్రాలు అందజేసి ‘మమ’ అనిపిస్తే ఎలా? వారి ని విధుల్లో చేర్చుకోవాలి కదా? పరిష్కారమయ్యే న్యాయబద్ధమైన హామీలు నెరవేర్చాల్సిందే. 

వారి మౌనం ప్రమాదకరం 

గత తొమ్మిదిన్నరేళ్ల్లు బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయం పై నిరంతరం ప్రశ్నించిన గొంతుకలు గడిచిన ఏడు నెలలుగా మూగబోవడం తీవ్ర చర్చకు దారి తీస్తున్నది. బలమైన ప్రశ్న, పోరా టం ముసుగులో ఫక్తు రాజకీయ అజెండాతో వచ్చిన ఒకరిద్దరు పదవులు రాగానే పెదాలు మూసుకున్నా రు. వారి నిజస్వరూపం బహిర్గతం అయింది. కానీ, ఆ నాడు తెలంగాణ మలి ఉద్యమ సమయంలో నియామకాల్లో ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని విప్పి జెప్పి, గత ప్రభుత్వం తప్పిదాలను ఎండగట్టిన మేధావులు 30 లక్షల మంది నిరుద్యోగుల కన్నీటి చెమ్మను తుడిచే ప్రయత్నం చేయకపోవడం విస్మ యం కలిగిస్తున్నది. వారి మౌనం తెలంగాణ సమాజానికి ప్రమాదకరం.

గతంలో ప్రతి అంశంపైనా స్పం దించి న్యాయం వైపు బాధితుల పక్షా న నిర్భయంగా నిల్చున్న ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి స్వరంలో తీవ్ర త తగ్గడం నిరుద్యోగులకు ఆవేదన కలిగిస్తున్నది. పేద కుటుంబాల నుండి ఆశయాలు భు జాన మోస్తూ అరకొర వసతుల నడుమ అర్ధాకలితో అక్షర యుద్ధం చేస్తున్న నిరుద్యోగులను అనుచితంగా కించపరుస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ ‘రాజకీయ నిరుద్యోగులు’ కాస్త ఆత్మవిమర్శ చేసుకోవాలి. న్యాయమైన డిమాండ్‌వైపు ‘ప్రశ్న’ ఎప్పుడూ నిటారుగా నిలబడాలి. ఆనాడు మ హిళలకు న్యాయం చేసే హిందూకోడ్ బిల్లు విషయం లో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏకంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజీనామా చేసి ‘న్యాయం’ వైపు నిలుచు న్న చరిత్రను మరిచిపోతే ఎలా? బుద్ధిజీవులు, సామాజిక ఉద్యమకారులు నిరు ద్యోగుల పక్షం నిలబడాలి.

 వ్యాసకర్త సెల్ : 9505475431