calender_icon.png 12 October, 2024 | 4:45 AM

కథను ప్రేక్షకుడిలాగే వింటా

10-10-2024 12:00:00 AM

హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల తొలి కొలాబరేషన్‌లో వస్తున్న చిత్రం ‘విశ్వం’. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు. 

* కథను నేను ప్రేక్షకుడిలాగే వింటా. బోర్ కొట్టకుండా ఉంటే చేయడానికి ఇష్టపడతా. శ్రీను వైట్ల ‘విశ్వం’ కథ లైన్‌గా చెప్పారు. ఆయన మార్క్‌తోపాటు యాక్షన్ ఫన్, కామెడీ ఫర్ఫెక్ట్‌గా రాశారు. ఆయన ప్రతి పాత్రలో కనిపిస్తారు. షూటింగ్ చేసేటప్పుడు ఆయన టైమింగ్ పట్టుకోవడం కొంచెం కష్టం అనిపించింది. కొంచెం ఎక్కువ సార్లు చేసి చూపించమని అడిగి, కాపీ కొట్టేశా. 

* షూటింగ్ చేసేటప్పుడు నేనే కొన్ని సీన్లకు నవ్వు ఆపుకోలేకపోయేవాడిని. చాలామంది ఆర్టిస్టులకు సారీ కూడా చెప్పాను. సన్నివేశాలు అంత బాగా వ చ్చాయి. విశ్వం పర్ఫెక్ట్ పండగ సినిమా. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకోవచ్చు. 

* ఇది హీరో స్టోరీ. పాపది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. ఆమె నటన చూసి షాక్ అయ్యా. నా క్యారెక్టర్ పేరు విశ్వం. టైటిల్ నా సెంటిమెంట్ అనుకుంటారేమో అని శ్రీను వైట్లకు చెప్పా. ఈ టైటిలే బాగుంటుందని అన్నారు. ఇండియాలో జరుగుతున్న ఒక ఇష్యూని అండర్ కరెంట్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్ వేలో చెప్పాం. 

* సినిమాలో చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి. కొంత ఎపిసోడ్ మనాలిలో మైనస్ 15 డిగ్రీల వద్ద చిత్రీకరించాం. ఆ కండీషన్‌లో చేతులు వంకర్లు పోయేవి. ఇటలీలోని షర్టీనియాలో ఒక మెలోడియస్ సాంగ్ చేశాం.. ఇప్పటివరకు అక్కడ ఎవరూ షూట్ చేయలేదు. కానీ అక్కడికి వెళ్లి షూట్ చేయడం సాహసోపేతం. అదొక కొండ ప్రాం తం. కొంచెం కాలు జారినా లోయలో పడతాం. 

* ప్రభాస్‌తో కలిసి నేను సినిమా చేయాలనేది అభిమానులు కోరుకుంటు న్నారు. మాకూ చేయాలనే ఉంది. కానీ అన్నీ సెట్ కావాలి. కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం.