‘జననాడి’కి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ నేత శ్రీనుబాబు
మంథని, ఆగస్టు 4(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు జననాడి కార్యక్ర మానికి శ్రీకారం చుట్టారు. కమాన్‌పూర్ మండలంలోని పేరపల్లిలో సోమవారం ప్రారంభించారు. ప్రజల సమస్యలను తెలసుకుని, అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సంద ర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి గ్రామంలో రచ్చబండ ద్వారా ప్రజలను సమీకరించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నా యా లేదా అని తెలుసుకోవడంతో పాటు అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు.
పంచాయతీల అభి వృద్ధికి, మౌళిక సదుపాయాల కల్పన తదితర అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల విషయమై మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ విభాగ అధ్యక్షుడు తిరుపతియాదవ్, మండల అధ్యక్షుడు వైనాల రాజు, యూత్ మండల అధ్య క్షుడు రాజు రేబల్, నాయకులు మారుతి, భాస్కరరావు, అన్నపూర్ణ పాల్గొన్నారు.