calender_icon.png 31 October, 2024 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు వారీ ఎనర్జీస్ లిస్టింగ్

28-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: గత వారం ఐపీవో లో ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందనను దక్కించుకున్న  సోలార్ ప్యానల్ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్  సోమవారం లిస్ట్ కానున్నది. ముంబై కేంద్రంగా కార్యకలాపా లు నిర్వహిస్తున్న వారీ ఎనర్జీస్ రూ.4,321 కోట్ల సమీక రణ కోసం జారీచేసిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగిసింది.

79.44 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. ఆఫర్ ధరను రూ.1,503గా నిర్ణయించింది. రెండు రోజుల క్రితం గ్రే మార్కె ట్ ప్రీమియం (జీఎంపీ) రెట్టింపు ఉండగా (రూ.3,000 ధరతో లిస్టవుతుందని అంచ నా), ఆదివారం ఈ ప్రీమియం భారీగా పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటు న్నాయి.

తాజా జీఎంపీ సంకేతాల ప్రకారం ఐపీవో ధరకు కాస్త అధికస్థాయిలో వారీ ఇంజనీర్స్ లిస్టవుతుందని అంచనా వేస్తున్నారు. ఐపీవోలో సమీకరించిన నిధులతో వారీ ఎనర్జీస్ 6 గిగావాట్ల ఇన్‌గోట్ వాఫెర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాం టును ఒడిస్సాలో నెలకొల్పుతుంది.