22-03-2025 09:40:53 AM
హైదరాబాద్: ఐపీఎల్ 18వ సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో కోల్ కతా, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా వేదికగా రాత్రి 7.30 గంటలకు కోల్‌కతా, బెంగళూరు మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్(Sunrisers Hyderabad vs Rajasthan Royals) జరుగుతుంది. హైదరాబాద్ వేదికగా మధ్యామ్నం 3.30 గంటలకు హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో జరగనున్న మ్యాచ్‌ల కోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు.
స్టేడియం లోపల, వెలుపల ఉంచిన 450 సీసీటీవి కెమెరాల ద్వారా నిఘాతో పాటు, 2,700 మంది పోలీసులతో కూడిన భద్రతా దళాన్ని మోహరించినట్లు తెలిపారు. ల్యాప్‌టాప్‌లు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, గొడుగులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, అగ్గిపెట్టెలు, లైటర్లు, పదునైన వస్తువులు, బైనాక్యులర్లు, పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్లు, పెర్ఫ్యూమ్‌లు, బ్యాగులు, బయటి ఆహార పదార్థాలు వంటి కొన్ని వస్తువులను స్టేడియంలోకి ప్రేక్షకులు తీసుకురావడాన్ని నిషేధించారు. మ్యాచ్ నుండి తిరిగి వచ్చే అభిమానులకు సజావుగా రవాణా చేయడానికి, మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలో 39,000 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. అటు రేపు చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్(Chennai Super Kings, Mumbai Indians) మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు ముంబయి, చెన్నై మ్యాచ్ స్టార్ట్ కానుంది.