- జిల్లాల్లో కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్‌లో కమిషనర్ పరిశీలన
- క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుకు అనుగుణంగా ఎంపిక
- 26 నుంచే అర్హులకు నూతన కార్డుల జారీ
- కొత్త రేషన్‌కార్డుల జారీకి సర్కారు మార్గదర్శకాలు
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): ఈ నెల 26 నుంచి పౌర సరఫ రాల శాఖ -ఆహార భద్రత(రేషన్) కార్డు లు జారీ కానున్నాయని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేప థ్యంలో సోమవారం కొత్త రేషన్ కార్డు ల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిం ది. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసుకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రి య జరగనున్నది.
దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత కులగణన సర్వేను ఆధారం చేసుకుని రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితాను జిల్లాల్లో కలెక్టర్, హైదరాబాద్ మహానగరంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ కార్యాలయానికి క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపి స్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు.
ముసాయిదా జాబితాను గ్రామ సభ, వార్డుల్లో ప్రదర్శిస్తారు. అక్కడే చదివి వినిపించి చర్చించిన తర్వాత జాబితాకు ఆమోదం లభిస్తుంది. ఆహార భద్రత కార్డుల్లో సభ్యుల మార్పు లు చేర్పులు కూడా చేయనున్నారు.
అర్హత కలిగిన కుటుం బాలకు ఈ నెల 26 నుంచి పౌర సరఫరాల శాఖ కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయనున్నది. దీంతో ఏండ్లు గా రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు పెద్ద ఊర టనే చెప్పవచ్చు. పలు పథకాలకు రేషన్ కార్డే ఆధారం కావ డంతో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.