22-04-2025 01:47:14 AM
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సా యంత్రం 6 గంటల వరకు నగరంలో ని మద్యం షాపులు బంద్ చేయాలని నగర పోలీసులు ఆదేశించారు.
నేడు, రేపు నగరంలోని వైన్స్, బార్‌అండ్‌రెస్టారెంట్లలోని మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు. ఈ నెల 25న జరుగబోయే కౌంటింగ్ రోజున ఉదయం 6 గంటల నుంచి 26 ఉదయం 6 గంటల వరకు కూడా మద్యంషాపులను మూసివేయాలని పోలీసులు సూచించారు.