calender_icon.png 25 February, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 నుంచి 27 వరకు మద్యం షాపులు, రెస్టారెంట్లు బంద్

25-02-2025 12:55:46 AM

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశం

యాదాద్రి భువనగిరి ఫిబ్రవరి 24 ( విజయ క్రాంతి): ఈనెల 27న జరగనున్న వరంగల్ -ఖమ్మం -నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ భువనగిరి జోన్ పరిధిలో 25 వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి 27వ తారీకు సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం షాపులు, రెస్టారెంట్లు, హోటల్లు, క్లబ్బులు ఇతర అన్ని రకాల మద్యం అమ్మకాలను నిలిపివేయాలని రాచకొండ కమిష నర్ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం-1968, సెక్షన్ 20, ప్రకారం కమిషనర్ పై విధంగా ప్రకటన చేశారు.

  డ్రై డే ఆదేశాలు అమలులో ఉన్న ఈ రెండు రోజులలో సాధారణ మద్యం షాపులతోపాటు ఇతర రకాల మద్యం అమ్మకాలకు లైసెన్సులు పొందిన వారు కూడా ఎటువంటి అమ్మకాలు లేదా సర్వ్ చేయడం జరపకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నిబంధనలను అతిక్రమించి మద్యం అమ్మకాలు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.