ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): కేజ్రీవాల్, కవిత లిక్కర్ కేసులో జైలుకెళ్లారని.. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆప్ అవినీతి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు పారదోలాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. శనివారం ఆయన ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
కేజ్రీవాల్ ఓ పెద్ద అబద్ధాలకోరని, లిక్కర్ స్కాం చేసే ప్రభుత్వాలను ఢిల్లీ ప్రజలు తరిమేయాలన్నారు. ఢిల్లీలో రోడ్లు పరిశుభ్రంగా లేవని, తాగునీరు కూడా ప్రజలకు అందట్లేదన్నారు. ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోదీని ఆశీర్వదించాలని కోరారు.
తాము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలన్నారు. పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు కూడా ఆరోపణలు రాలేదన్నారు.