26-02-2025 12:09:19 AM
ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2వేల కోట్లు నష్టం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఆప్ ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకి రూ.2,002 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ రిపోర్ట్ తేల్చింది. 2017 మధ్య కా లానికి సంబంధించిన లిక్కర్ పాలసీ విధివిధానాలపై కాగ్ అధ్యయనం చేసి నివేదికను రూపొందించింది. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాగ్ నివేదికను సీఎం రేఖా గుప్తా మంగళవారం సభలో ప్రవేశపెట్టారు.
ఆప్ ఎమ్మెల్యేలు సస్పెండ్
ఆప్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. అతిశీ సహా 21 మంది ఆప్ ఎ మ్మెల్యేలను ఒక రోజు పాటు సభ నుంచి స్పీ కర్ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సస్పెన్షన్‌ను మూడు రోజులపాటు పొడగించారు.
సీబీఐ విచారణకు డిమాండ్
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికపై ప్రతిపక్ష నేత అతిశీ స్పందించారు. కాగ్ రిపోర్ట్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాం డ్ చేశారు. పాత లిక్కర్ పాలసీ ద్వారా హ ర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి అక్రమమార్గం లో ఢిల్లీకి మద్యం వచ్చేదని పేర్కొన్నారు.
28 శాతం అవినీతి కాంట్రాక్టర్ల వల్ల జరిగిందని, డబ్బు దళారీల జేబుల్లోకి వెళ్లిందనే విషయా న్ని కాగ్ నివేదిక వెల్లడించిందని.. కాగ్ రిపోర్ట్‌తోపాటు కొత్త విధానాన్ని అమలు చేయ కుండా అడ్డుకుంది ఎవరనే విషయంపై సీబీ ఐ దర్యాప్తు చేయాలని ప్రతిపక్ష నేత అతిశీ డిమాండ్ చేశారు.