23-02-2025 04:07:29 PM
చోద్యం చూస్తున్న అబ్కారీ శాఖ
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పాల్వంచలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్(Bar and Restaurant) తెలవారాగానే గ్లాసుల గలగల ప్రభుత్వ అధికారుల కముసన్నాలో మద్యం విక్రయాలు(Liquor Sales) నడుస్తున్నట్లు సమాచారం. సమయపాలన పాటించకపోవడం, అధిక రేట్లకు ఇష్టం వచ్చిన ధరకు విక్రయించటం జరుగుతోంది. ఉదయం నాలుగు గంటల నుంచే అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నా వైనం పట్టణంలో చోటుచేసుకుంది. దీనితోడు కల్తీ మద్యం(Alcohol Adulterado) విక్రయిస్తున్నారనే ఆరోపణల సర్వత్ర వినిపిస్తున్నాయి.
ఇటీవల పట్టణ పరిధిలోని పేట చెరువు గ్రామంలో కల్తీ మద్యం తాగి సేవించి మృత్యువాత పడిన విషయం, మరొక వ్యక్తి ఆసుపత్రి పాలైన సంఘటన పాల్వంచలో చోటుచేసు కొన్నది. తాజాగా ఓ బార్ షాపులో కల్తీ మద్యం విక్రయించినట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ అయిన విషయం విధితమే. ఉదయం వేళల్లో మద్యం సేవించడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని పదుల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు బార్లు, రెస్టారెంట్ల్లో సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని, కల్తీ మద్యం విక్రయించకుండా నిఘా ఏర్పాటు చేయాలని పాల్వంచ పట్టణ పరిధిలో డిమాండ్ చేస్తున్నారు.