ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): నీఛమైన రాజకీయాల గురించి కవిత మాట్లాడటం విడ్డూరమని ఎంపీ చా మల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నీఛ రాజకీయాలు ఎవరు చేస్తున్నారో యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మీ ఫ్యామిలీ డైవర్షన్ పాలిటిక్స్ అందరికీ తెలిసిపోయాయని అన్నారు.
లిక్కర్ సామ్రాజ్య కేసులు రోజుకోటి బయటపడుతున్నాయని, అందుకే ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టారని కవితను విమర్శించారు. ఇప్పటి వరకు ఢిల్లీలోనే బయటపడిన కవిత భాగోతం ఇప్పుడు కేరళలో బయటకు వచ్చిందన్నారు.
లిక్కర్ దందాలు దేశవ్యాప్తంగా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయోనని ఎద్దేవా చేశారు. నీళ్ల విషయంలో కేసీఆర్ చేసినంత అన్యాయం తెలంగాణకు ఇంకెవరూ చేయలేదని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి దోపిడికి మీ తండ్రే కారణమం టూ కవితను విమర్శించారు.