calender_icon.png 4 January, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిక్కర్ వ్యాపారం చేసి తాగుబోతులుగా మార్చి క్రైమ్‌రెట్ పెంచారు

01-01-2025 11:32:42 PM

ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ...

నిజామాబాద్ (విజయక్రాంతి): లిక్కర్ వ్యాపారం చేసి తాగుబోతులుగా మార్చి క్రైమ్‌రెట్ పెంచారని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జైలుకు పోయి వచ్చిన నాయకులు క్రైమ్ రేట్ పెరిగిందని మీడియా సమావేశం పెట్టి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తాము గాలి మాటలు మాట్లాడమని అభివృద్ది చేసి చూపిస్తామని తెలిపారు. నిధులు తీసుకొవచ్చి అభివృద్ది చేసి చూపుతామన్నారు. నిజామాబాద్ ప్రజలందరికి గుట్కా దందా చేసేవారు ఎవరో తెలుసని పేర్కొన్నారు. ఇసుక దందా, అక్రమ బియ్యం వ్యాపారం చేసే వారు ఏ పార్టీ వారో ప్రజలందరికి తెలుసన్నారు. నిజామాబాద్ పట్టణ అభివృద్ది కొరకు టీయూఎఫ్‌ఐడీసీ నిధులు 60 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రితో ప్రత్యేక మాట్లాడి నిధులు మంజూరు చేయించానని తెలిపారు. పట్టణంలోని దాదాపు అన్ని డివిజన్లకు డ్రైయిన్ సీసీ రోడ్లు, కల్వర్టులు, పట్టణ అభివృద్ది కోసం టీయూఎఫ్‌ఐడిసీ నిధులు మంజూరు చేయించానని తెలిపారు.

తాను మాటలతో అభివృద్ది చేయనని చేతలతో అభివృద్ది చేసి చూపిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఇంకో 50 వేల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. బిజెపి నాయకులు మాలు చెబుతారు గాని అభివృద్ది చేయరని విమర్శించారు. ప్రదాని నరేంద్రమోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎన్ని ఇచ్చాడన్నారు. ప్రతి ఖాతాలో 15 లక్షలు నల్లధనం వేస్తానని ఎంతమందికి వేశాడని ప్రశ్నించారు. దేశాన్ని దోచి ఆదాని, అంబానీలకు పెడుతున్నారని, ప్రపంచం మొత్తం అదాని డిఫాల్టర్ అంటుంటే నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రానిగా మార్చి 8 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. నేడు రైతులకు రుణమాఫీ కాలేదు అంటూ గగ్గోలు పెడుతున్నారని, బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో రుణమాఫీ ఎంత చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీ చేసి 21 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసిందని మిగతావారికి కూడా చేస్తామని తెలిపారు.

సంక్రాంతి రైతు భరోసా కూడా అందజేస్తామన్నారు. ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. రాష్ట్రం మొత్తం 25 లక్షల నిరుపేదలకు ఇల్లు అందిస్తామన్నారు. దానికోసం 12 వేల 500 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామన్నారు. దానికోసం ప్రత్యేకమైన యాప్‌ను విడుదల చేసి దాంట్లోనే అందరూ అప్లు చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్లకు సర్వే కూడా మొదలుపెట్టామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు. ఆరు గ్యారెంటీల్లో అన్ని అమలు చేస్తామన్నారు. ఎన్నికల్లో హమీ ఇచ్చిన దానికంటే ఎక్కువగానే అమలు చేస్తామని తెలిపారు.