రూ.12 లక్షలు విలువ చేసే గోవా సరుకు స్వాధీనం
రాజేంద్రనగర్,సెప్టెంబర్ 5: గోవా నుంచి అక్రమంగా తీసుకొచ్చిన మద్యాన్ని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ దేవేంద ర్‌రావు తెలిపిన వివరాలు.. విశ్వసనీ య సమాచారంతో బుధవారం అర్ధరాత్రి దాటాక ఎక్సైజ్ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని అరైవ ల్ పాయింట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 12 మంది వద్ద గోవా నుంచి నిబంధనలకు విరుద్ధం గా తీసుకొచ్చిన 415 బాటిళ్ల నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఇది దాదాపు 352 లీటర్లు ఉంటుందని, దీని విలువ రూ.12 లక్ష లు ఉంటుందని అంచనా వేస్తున్నా రు. ఈ మద్యం తీసుకొచ్చిన 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ దేవేందర్‌రావు పేర్కొన్నారు. అక్రమంగా మద్యం తరలించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సైజ్ ఎన్‌ఫో ర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, రం గారెడ్డి జిల్లా డీసీ రంగనాథ్, ఏసీఆర్ కిషన్, ఏఈఎస్ జీవన్‌కిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు, శంషాబాద్ డీటీ ఎఫ్ సిబ్బంది ఉన్నారు.