calender_icon.png 16 January, 2025 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకింగ్ వ్యవస్థకు లిక్విడిటీ సవాళ్లు

11-09-2024 12:00:00 AM

డిపాజిట్ వృద్ధిని రుణ వృద్ధి మించడం ఆందోళనకరం

ఫిక్కీ ఐబీఏ రిపోర్ట్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: డిపాజిట్ల వృద్ధి రేటును మించి రుణ వృద్ధి రేటు పెరగడంతో బ్యాంకింగ్ వ్యవస్థకు లిక్విడిటీ సవాళ్లు ఎదురవుతాయని ఫిక్కీ ఐబీఏ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. రుణ వడ్డీ వ్యయాల్ని అదుపులో ఉంచుకోవాలంటే రుణ వృద్ధికి తగ్గట్లు డిపాజిట్లను పెంచుకోవడమే బ్యాంక్‌ల  ప్రధమ ఏజెండా కావాలని రిపోర్ సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్‌లు, విదేశీ బ్యాంక్‌లతో కలిపి మొత్తం 22 బ్యాంక్‌లతో ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో ఒక సర్వే నిర్వహించి ఈ రిపోర్ట్‌ను ఫిక్కీ ఐబీఏలు సంయుక్తగా రూపొందించాయి.

సర్వే లో పాల్గొన్న 67 శాతం బ్యాంక్‌లు వాటి మొత్తం డిపాజిట్లలో  కాసా (కరెంట్ అకౌం ట్, సేవింగ్స్ అకౌంట్) డిపాజిట్ల వాటా తగ్గుతున్నదని వెల్లడించాయి. అధిక/ ఆకర్షణీ యమైన వడ్డీ రేట్ల కారణంగా టెర్మ్ డిపాజిట్లు పెరిగాయని కొన్ని బ్యాంక్‌లు తెలిపా యి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో 80 శాతం, సగానికిపైగా ప్రైవేటు బ్యాంక్‌లు వాటి కాసా డిపాజిట్ల వాటా తగ్గినట్లు వెల్లడించాయి. గత ఆరు నెలల్లో మొండి బకాయిలు తగ్గాయని మెజారిటీ బ్యాంక్‌లు (71 శాతం) తెలిపాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ల్లో 90 శాతం, ప్రైవేటు బ్యాంక్‌ల్లో 67 శాతం వాటి ఎన్‌పీఏలు తగ్గినట్లు సర్వేలో వెల్లడించినట్టు ఫిక్కీ ఐబీఏ రిపోర్ట్ వివరించింది.  

ఇన్‌ఫ్రా రంగం నుంచి రుణాలకు అధిక డిమాండ్

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెటల్స్, ఐరన్ అండ్ స్టీల్ రంగాల నుంచి దీర్ఘకాలిక రుణాలకు డిమాండ్ పెరుగుతున్నదని సర్వే తెలిపింది. సర్వేలో పాల్గొ న్న 77 శాతం బ్యాంక్‌లు ఇన్‌ఫ్రా రం గానికి రుణ వితరణ పెరిగిందని పే ర్కొన్నాయ. మౌలిక రంగంపై ప్రభు త్వం మూలధన వ్యయాన్ని పెంచుతున్నందున ఈ డిమాండ్ ఏర్పడిందని ఫిక్కీ ఐబీఏ రిపోర్ట్ వ్యాఖ్యానించింది.