calender_icon.png 9 January, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి, సంక్షేమానికి పెద ్దపీట

05-01-2025 01:25:48 AM

* ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా హామీల అమలు

*  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 

ఖమ్మం, జనవరి 4 (విజయక్రాంతి)/కూసుమంచి: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా హామీలను అమలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఖ  ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పర్యటించారు.

కూసుమంచి మండలం లో  కోక్యతండా, లింగారం తండాలో సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కూసుమంచి క్యాంప్ కార్యాలయం  సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అంద  ఈ సమదర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటి వరకు 64 లక్షల దరఖాస్తుల సర్వే ఈ ద్వారా పూర్తి చేసినట్టు తెలిపారు. మిగిలిన దరఖాస్తుల సర్వే మరో నాలుగు  రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు.

గత ప్రభుత్వం చేపట్టిన వివిధ దశల్లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను సంక్రాంతి లోపు పంపిణీ చేస్తామని, అసంపూర్తిగా ఇండ్లను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ హేమలత, ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వరావు, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పీఆర్ ఈఈ వెంకటరెడ్డి, డీపీవో రాంబాబు పాల్గొన్నారు. 

మహిళలు ఆర్థికంగా బలపడాలి 

మహిళలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి  కార్యక్రమాన్ని అమలు చేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన స్త్రీ టీ స్టాల్‌ను ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. టీ స్టాల్ ఏర్పాటు చేసిన మహిళలను అభినందించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, ఆర్డీ  నరసింహారావు, అదనపు డీఆర్డీవో నూరొద్దీన్ పాల్గొన్నారు.