27-04-2025 12:00:00 AM
చెంచా తేనె, అరచెంచా దానిమ్మ రసం తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్లు చేసుకుని 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా చేసుకుని లిప్ బామ్ రాసుకోవాలి.
కొద్దిగా కలబంద గుజ్జు తీసుకుని పెదవులకు అప్లు చేసి కాసేపు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
పెదాలపై మృతకణాలను తొలగించడానికి చెంచా చొప్పున తేనె, చక్కెర తీసుకుని మూడునాలుగు చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు పట్టించి.. చక్కెర కరిగేవరకు మృదువుగా రుద్దాలి. ఆ తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుని లిప్‌బామ్ అప్లు చేయాలి.