calender_icon.png 28 April, 2025 | 11:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద కుటుంబానికి లయన్స్ క్లబ్ రూ.15 వేలు సహాయం

28-04-2025 02:18:10 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో నిలువ నీడలేని దేవరకొండ లక్ష్మీనారాయణ అనే నిరుపేద ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన కుటుంబానికి కేసముద్రం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 15 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు లక్కాకుల సత్యనారాయణ, ఎర్నం శ్రీరాములు, నాగేశ్వర చారి, కొత్త జగన్మోహన్రెడ్డి, చింత కర్ణాకర్, మడిపెద్ది వెంకటేష్, రాపాక కుమారస్వామి, బొప్పిడి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.