30-03-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, మార్చి 29(విజయక్రాంతి): చదువులో రాణిస్తున్న ఉత్తమ విద్యార్థి కి లయన్స్ క్లబ్ హోప్ ఫౌండేషన్ చేయూత అందించింది. చందానగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ హోప్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ విద్యాలో రాణిస్తున్న కార్తీక్ 10 వ తరగతి విద్యా కోసం రూ. 25 వేల చెక్కును ఆయన నివాసంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉన్నత చదువుల కోసం ఆర్థికంగా బాధపడోద్దని తన దృష్టికి వచ్చిన ప్రతి సామాన్యలకు ఆర్థికంగా అండగా ఉంటానని చెప్పారు. కార్తీక్ లాంటి పేద విద్యార్థి విషయంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని తన దృష్టికి తెచ్చారని, అలాగే నియోజకవర్గంలోని ఇతర విద్యార్థుల గురించి వివరిస్తే తన వంతు సాయం చేస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ ట్రెజరర్ మర్రి ప్రవీణ్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ శ్రీధర్, రీజియన్ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, లయన్ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.