25-02-2025 08:05:50 PM
బైంసా (విజయక్రాంతి): కుబీరు మండలంలో విద్యుత్తు సబ్ స్టేషన్ లో లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న దావు(45) గుండెపోటుతో మంగళవారం హఠాన్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు వివరాలు.. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన నిజామాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందారని పేర్కొన్నారు. మృతునికి భార్య విజయ ఇద్దరు కుమారులు ఓ కూతురు ఉన్నారు. ఆయన మృతి పట్ల బైంసా డిఈ శ్రీనివాస్ రెడ్డి, ఏడిఈ ఆదిత్య, మండల ఏఈ విద్యుత్ సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.