calender_icon.png 30 October, 2024 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాషా పండిత పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలి

07-07-2024 01:10:15 AM

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): అప్‌గ్రేడ్ పోస్టుల పదోన్నతుల తర్వాత రాష్ట్రం లో మిగిలిన లాంగ్వేజ్ పండిట్ (భాషా పం డిత) పోస్టులను సైతం అప్‌గ్రేడ్ చేయాలని, అ ర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్‌యూపీపీటీఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.జగదీశ్, ఎస్.నర్సింహులు, రాష్ట్ర కోశాధికారి కట్టా గిరిజా రమణ శర్మ విజ్ఞప్తి చేశారు. శనివారం ఈమేరకు హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అప్‌గ్రేడ్ ప్రక్రియ దాదాపు పూర్తయినప్పటికీ, మిగిలిన వారికి కూడా పదోన్నతులు కల్పించాలన్నారు. తద్వారా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు బలోపేతమవుతాయన్నారు.