కామారెడ్డి (విజయక్రాంతి): వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్సై సుధాకర్ ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యాపారి వద్ద నుంచి రూ.12,500 తీసుకుంటూ పట్టుబడ్డాడు. బుధవారం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో డబ్బులు తీసుకుంటూ రెండ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. కాగా.. ఎస్సై సుధాకర్ లీవ్‌పై నిజామాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. గత రెండు నెలల కిత్రం ఇదే స్టేషన్లో పనిచేసిన ఎస్సై అరుణ్ కుమార్ ఓ కేసు విషయంలో రూ. 20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే.