కామారెడ్డి,(విజయక్రాంతి): అవినీతి అధికారులు తమ తీరును మార్చుకోవడం లేదు. ఒకవైపు ఏసీబీ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్న అవినీతి అధికారులను పట్టుకుంటున్న మార్పు రావడంలేదు. వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా లింగంపేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ విధులు నిర్వహిస్తున్న అరుణ్, రైటర్ రామస్వామి ఓ కేసు విషయంలో శివలింగ గౌడ్ అనే వ్యక్తిని రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో అతను ఏసీబీ అధికారులను కలిసి విషయం మొత్తం వివరించాడు.
దీంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో లింగంపేట పోలీస్ స్టేషన్ పై దాడులు నిర్వహించి ఎస్ఐ అరుణ్ 10 వేలు లంచం తీసుకుంటుండగా గురువారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో కేవలం వారం రోజుల్లోనే ఇద్దరు ఎస్ఐలు ఏసీబీ అధికారులకు చిక్కడం కలకలం రేపుతోంది. ఏసీబీ అధికారులు ఒకవైపు అవినీతి అధికారుల భరతం పడుతున్న తీరు మారడం లేదని పట్టణ ప్రజలు అనుకుంటున్నారు. గత వారం క్రితమే నిజాంబాద్ జిల్లా వర్ని ఎస్ఐ కృష్ణ కుమార్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం విధితమే.