08-04-2025 12:15:38 AM
కామారెడ్డి, ఏప్రిల్ 7(విజయక్రాంతి): ఆ గ్రామంలో నీటి కరువు, ఏ అధికారి ఆ గ్రామానీకి వచ్చిన నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులు ప్రజాప్రతి నిధులతో ఏ కరువు పెట్టారు. తమకు బోరు వేసి నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులందరూ కలిసి కోరారు. అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిన గ్రామస్తులు ఇంటికి 500 చొప్పున చందాలు వేసుకున్నారు.
అధికారులు ప్రజా ప్రతినిధులు తమ సమస్యను తీర్చలేరని భావించిన గ్రామస్తులు ఒకచోట చేరి చర్చించుకున్నారు. నిత్యం నీటి కోసం ఇబ్బందులు పడే కంటే ఇంటికి 500 చొప్పున డబ్బులు చందాలుగా గ్రామస్తులు పోగు చేసుకున్నారు. ఎవరికోసం ఎదురు చూసిన నీటి సమస్య మాత్రం పరిష్కరించడం లేదని గ్రయించిన గ్రామస్తులు ఒక తాటి పైకి వచ్చి డబ్బులు జమ చేశారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామస్తులు అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత నెల రోజుల నుంచి నీటి సమస్యతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. నీటి సమస్య పరిష్కరించేందుకు ఎంపి, ఎమ్మెల్యే, కలెక్టరు, మండల స్థాయి అధికారులకు విన్నవించారు.
ఎవరు కూడా చేస్తామని చెప్పడమే తప్ప ఆచరణలో నెరవేర్చకపోవడంతో గ్రామస్తులు అందరూ కలిసి ఇంటికి 500 చొప్పున జమ చేసుకొని గ్రామంలో ఉన్న రెండు బోర్లు చెడిపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడ్డారు. పార్టీలకతీతంగా గ్రామస్తులందరూ కలిసి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రెండు లక్షల 50 వేలు జమ చేసుకొని బోరు వేయించారు.
నీరు పుష్కలంగా పడడంతో గ్రామస్తులకు అందుబాటులో లేనటువంటి బావి నుంచి నూతన పైపు లైన్ కు రూ.30 వేలు ఖర్చు చేశారు. నీటి సమస్యపై ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు ప్రజా ప్రతినిధులు చూసి చూడనట్టుగా వ్యవహరిం చారు. అధికారులు గ్రామస్తులు అందరూ కలిసి చందాలు వేసుకుని బోరు వేయించుకొని ఆదర్శంగా ఆ గ్రామస్తులు నిలిచారు.
లింగంపల్లి గ్రామంలో గత నెల రోజుల నుండి నీటి సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కలెక్టర్ ఆశిష్ సంగువాన్ వరకు చెప్పిన ఎవరు సహాయం చేయకపోవడంతో, ఎవరి సహాయం లేకుండా ఏ నాయకుడు చేయని పనులను సైతం తాము కలిసికట్టుగా ఉన్న గ్రామ ప్రజలు ప్రతి ఇంటికి 500 రూపాయల చొప్పున జమ చేసుకొని గ్రామానికి సంబంధించిన రెండు బోర్లు చెడిపోవడంతో నీటి కరువుతో కటకట లాడగా నూతన బోరు కోసం గ్రామ మాజీ తాజా సర్పంచులతో సహా గ్రామ వివిధ పార్టీల అధ్యక్షులు,
మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మాజీ తాజా జెడ్పిటిసి, ఎంపిటిసిల తో సైతం ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ కి గోడు వినిపించుకున్న ఎవరు ఎలాంటి సహాయం చేయనప్పటికీ గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి 500 రూపాయల చొప్పున జమ చేసుకొని నూతన బోరు కు రెండు లక్షల 50 వేలు ఖర్చు చేసి నీటి సమస్యను గ్రామస్తులు పరిష్కరించుకున్నారు.
కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో లేనటువంటి బావిని నూతన పైప్ లైన్ తో సుమారు 30 వేల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్లు చేయించి నీటి సమస్యను గ్రామస్తులు తీర్చుకొని ఇతర గ్రామాలకు ఆదర్శంగా లింగంపల్లి గ్రామస్తులు నిలిచారు.
ఇటీవలే కలెక్టర్ టోల్ ఫ్రీ నెంబర్ కి మొరపెట్టుకున్నప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన ఎలాంటి సహాయక చర్యలు అందించకపోవడంతో గ్రామస్తులు ముందడుగు వేసి తమ గ్రామ సమస్యను తామే పరిష్కరించు కున్నారు. గ్రామస్తులు ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించుకున్న గ్రామస్తులు కలిసికట్టుగా ఉంటే గ్రామ సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని లింగంపల్లి గ్రామస్తులు నిరూపించారు.