21-02-2025 12:45:39 AM
సూర్యాపేట, ఫిబ్రవరి20(విజయక్రాంతి): ఐదు రోజుల పాటు ఓ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో మార్మోగిన పెద్దగట్టుజాతర గురువారం ముగిసింది. చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో కొలువైన శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణలోనే రెండో అతిపెద్దదైన ఈ జాతర ఈ నెల 16వ తేదీన సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి దేవరపెట్టె, సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి మకర తోరణాన్ని పెద్దగట్టుకు తీసుకు రావడంతో ప్రారంభమైంది. జాతరలో అత్యంత ముఖ్య ఘట్టమైన సౌడమ్మ తల్లికి బోనాల చెల్లింపు కార్యక్ర మాన్ని సోమ వారం నిర్వహించారు.
మంగళవారం చంద్ర పట్నం, బుధవారం నెలవారం కార్యక్రమా లను చేపట్టారు. గురువారం మకర తోర ణాన్ని సూర్యాపేటకు తరలించడంతో జాతర ముగిసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జిల్లా అధికారులు, ఆలయ పాలకవర్గం సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేశారు.
మకర తోరణం ప్రత్యేకత..
యాదవుల సంప్రదాయం ప్రకారం జాతర ప్రారంభానికి ముందు లింగ మంతుల స్వామి అలంకరణ కోసం సూర్యా పేట జిల్లా కేంద్రం నుంచి కోడి, వల్ల పు వంశస్తులు మకర తోరణాన్ని తెచ్చారు.
ఈ తోరణాన్ని తిరిగి ఊరేగింపుగా సూర్యా పేటకు తరలించారు. అదేవిధంగా లింగ మంతుల స్వామి గుడిపై ఉంచిన పసిడి కుండను ఖాసీం పేటకు చెందిన అలిశెట్టి వంశస్తులు జాతరకు ముందు తీసుకువచ్చి తిరిగి గురువారం తీసుకువెళ్లారు.
అన్ని శాఖల సమన్వయంతో..
జాతర విజయవంతం కావడంలో అన్ని శాఖలు సమ న్వయంగా పని చేశాయి. పోలీసు శాఖ అత్యాధునిక సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణను విజయ వంతంగా నిర్వహించింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి ప్రజా రవాణాకు సమహకరించింది.
వైద్యా రోగ్యశాఖ ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తులకు సేవలందించింది. పారిశుద్ధ్య నిర్వహణలో మున్సిపల్ శాఖ, భక్తులకు తాగునీటికి ఇబ్బం దులు ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సమన్వయంతో జాతర కవరేజీ నిర్వహించింది.
వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు పర్యాటక ప్రదేశాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకున్నాయి. జాతరలో విజయవంతంగా పూర్తికావడం తో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. జాతరను విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులకు, ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు