calender_icon.png 23 March, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగం గౌడ్ పేదల కోసం పోరాడిండు

22-03-2025 01:08:58 AM

చేవెళ్ల, మార్చి 21: సీపీఐ నేత లింగం గౌడ్ ఊరిపి పోయే వరకు పేదల కోసమే పోరాటం చేశాడని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి పామె భీమ్ భరత్ కొనియాడారు.  శుక్రవారం లింగం గౌడ్ 24వ వర్ధంతి సందర్భంగా మొయినాబాద్ మండలం తోల్ కట్ట గేటు దగ్గర ఉన్న స్తూపం వద్ద నివాళి అర్పించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... లింగం గౌడ్ ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల కోసమే ఆలోచన  చేసేవారని, పేదలకు భూములు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఎన్నో ఉద్యమాలు చేశారని గుర్తుచే శారు.  ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం సీసీపీ మండల కార్యదర్శి కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో  సీపీఐ  రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి,  రైతు కూలీ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పి నాగిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం ప్రభు లింగం,   రైతు సంఘం కౌన్సిల్ సభ్యుడు ఎం సుధాకర్ గౌడ్, బీకేఎం జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య,  మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు వడ్ల మంజుల లింగం గౌడ్ స్తూపంతో పాటు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ఈ కార్రక్రమంలో లింగం గౌడ్  సతీమణి అనసూయ, వారి కుమారులు శంకర్ గౌడ్, శ్రీశైలం గౌడ్, సత్య గౌడ్, నాయకులు జలీల్, వెంకటయ్య, ఏసురత్నం, ఎండి మక్బూల్, భిక్షపతి, రవి, మల్లేశ్, స్వరూప తదితరులు పాల్గొన్నారు.