మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 11 (విజయక్రాంతి): కొండరెడ్ల కుటుంబాలలో వెలు రేఖలు ప్రకాశించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తు నాగేశ్వరరావు అన్నారు. కొండరెడ్ల గిరిజన కుటుంబాల సంక్షేమం కోసం ఖ ఎంపీ రఘురామిరెడ్డి, జిల్లా అధికారులతో కలిసి శనివారం దమ్మపేట మండలం పూసుకుంట కొండరెడ్ల గ్రామస్థులతో ప్రత్యే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండరెడ్లకు వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్లు, పిల్లల చదు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని అన్నారు.
40 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన చొరవతో పూసుకుంట గ్రామానికి రహదారి సౌకర్యం, కల్వర్టులు, కొండరెడ్ల కుటుంబాలు జీవనోపాధికి సంక్షేమ పథకాలు అందించడానికి కృషి చేశామన్నారు.
గిరిజన యువ హైదరాబాదులో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, డీఆర్‌డీవో విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డీఎఫ్‌వో కృష్ణగౌడ్, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంక ఆర్డీవో మధు, సీపీవో సంజీవరావు, సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ, తహసీల్దార్ వాణి, ఎంపీడీవో రవి చంద్రారెడ్డి, డీటీఆర్ వైఎఫ్‌ఆర్ లక్ష్మినారాయణ, ఎఫ్‌డీవో ఉదయకుమార్ పాల్గొన్నారు.