05-03-2025 01:08:29 AM
కల్లూరు /మార్చి 4(విజయ క్రాంతి ) : కల్లూరు మండల విద్యుత్ స్టేషన్ లో లైన్మెన్ డేని పురస్కరించుకొని విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా విద్యుత్ ఉద్యోగులు ఉత్సవం నిర్వహించారు. సంస్థ మనుగడ కోసం , తమ బాధ్యతలను, విధులను, తమ కర్తవ్యం గా భావిస్తూ, వినియోగదారుల పట్ల స్నేహభావంతో ఉంటామని, వారికి అన్ని వేళలో అందుబాటులో ఉంటు పనిచేస్తామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేపించారు.ఈ సందర్బంగా శాఖ అధికారి వెంకట్, సబ్ ఇంజనీర్ పి గురునాధం లను శాలువాలతో సత్కరించారు. ఉపకేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఎల్ రవి, లైన్ ఇన్స్పెక్టర్ లు బత్తుల సత్యనారాయణ, ఉస్మాన్ బేగ్, గ్రామీణ లైన్ మెన్ శ్రీను, జూనియర్ లైన్మెన్ లు, మురళి, రమేష్,రవి, జాన్, సబ్ స్టేషన్ ఆపరేటర్లు , బిల్లు కలెక్టర్లు , స్పాట్ బిల్లర్లు కిరణ్, రాజారావు తదితరులు పాల్గొన్నారు.