calender_icon.png 4 March, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా లైన్ మాన్ దినోత్సవ వేడుకలు

04-03-2025 07:38:37 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): మండలంలోని తాళ్ల గోమ్మూరు సబ్ స్టేషన్లో లైన్ మెన్ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భద్రాచలం డిఈ జీవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అత్యవసర పరిస్థితిల్లో విద్యుత్ సరఫరా చేసేందుకు లైన్ మాన్ క్షేత్రస్థాయిలో పనిచేసే యుద్ద వీరుల ఆన్ మ్యాన్డ్ ఆర్టిషన్ జేఎల్ఎం, ఏ ఎల్ఎం, ఎల్ఎం, ఎస్ఎల్ఐ, ఎఫ్ఎం, ప్రతి ఒక్కరుని ప్రశంసించారు. ప్రమాదం జరగకుండా పనులుచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. అనంతరం అవార్డులు అందజేశారు. ఉన్నతాధికారులు క్రింద స్థాయిలో పని చేస్తున్న వారి భద్రతే సంస్థకి ముఖ్యమని పేర్కొన్నారు. అందరు పాటించి, సీఎండీ ఏంతో సహకారాన్ని అందించుతున్నారని, లైన్ మాన్ దివాస్ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ వేణు, ఏఏఈ ఉపేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.