calender_icon.png 4 March, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సబ్ స్టేషన్ లో లైన్మెన్ దివస్

04-03-2025 07:48:44 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో మంగళవారం విద్యుత్ లైన్మెన్ దినోత్సవం ఘనంగా పురస్కరించుకొని సబ్ స్టేషన్ సెక్షన్ ఆఫీస్ లొ సబ్ ఇంజనీర్ సాల్మన్ రాజ్ సమక్షంలో విద్యుత్ సిబ్బంది అందరికీ శాలువలతో సన్మానిచడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ ఇంజనీర్ సాల్మన్ రాజ్ మాట్లాడుతూ... సిబ్బంది అందరు లైన్లో వెళ్ళినప్పుడు సేఫ్టీ, సేవా అందించాలని సంస్థను అగ్రభాగాన నిలపాలని ప్రజలలో విద్యుత్ సిబ్బందిపై ఉన్న నమ్మక్కని కలిగించి విధి నిర్వహణలో భాగంగా విధ్యుత్ అంతరాయం కలిగినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదని వివరించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ సాల్మన్ రాజ్ ఎల్ ఐ రామయ్య లైన్మెన్ కాశీరాం  ఏ ఎల్ ఎం వినోద్ కుమార్, నరేష్, రాజేష్, సంజీవ్, రమేష్, వినయ్, చందు, మాదప్ప, గోపాల్ పాల్గొన్నారు.